![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ సీజన్ సిక్స్ తో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న వారిలో ఇనయా సుల్తానా ఒకరు. ఇనయా తన ఫ్యామిలీని వదిలి ఇండస్ట్రీకి వచ్చిందని చాలాసార్లు చెప్పింది. ఇక బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో రేవంత్, శ్రీహాన్ లతో పోటీపడి ఆడిన ఇనయా సుల్తానాకి బయట ఫ్యాన్ బేస్ పెరిగింది.
ఇక బయటకొచ్చాక గోవా టూర్లు, విదేశీ టూర్ల పేరుతో వ్లాగ్స్ చేస్తూ ఫుల్ వైరల్ గా నిలిస్తోంది. తరచూ అందాల ఆరబోత చేస్తూ కుర్రాళ్ళని తనవైపు తిప్పుకుంటుంది. తాజాగా జిమ్ ట్రైనర్ గౌతమ్ తో డేటింగ్ లో ఉన్న ఇనయా.. విచ్చలవిడిగా తిరిగేస్తూ నెట్టింట వైరల్ గా మారారు. ఇనయా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు తనకి ఫ్యాన్ బేస్ పెరిగింది. బయటకొచ్చాక రకరకాల వ్లాగ్స్ తో మరింతగా ఫాలోయింగ్ ని పెంచుకుంది.
తాజాగా ఇనయా సుల్తానా ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తను బిగ్ బాస్ కి వెళ్ళడం వల్లే సినిమా అవకాశాలు కోల్పోయినట్టు ఇందులో చెప్పుకొచ్చింది. అంతకముందు తనకి సినిమా ఆఫర్లు వచ్చాయంట, ఇప్పుడు అవేమీ రావడం లేదని ఇందులో చెప్పింది. అయితే తను మాట్లాడిన ఈ మాటలకి నెటిజన్లు మండిపడూతూ కామెంట్లు పెడుతున్నారు. నువ్వు బిగ్ బాస్ కి వెళ్ళకుంటే ఇప్పుడు వస్తున్న ఈ అవకాశాలు కూడా రావని, అనవసరంగా నిన్ను బిగ్ బాస్ కి తీసుకెళ్ళి సెలెబ్రిటీనీ చేశారంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇక తాజాగా థియేటర్లలో రిలీజైన 'శివం భజే' మూవీలో తను నటించింది. ఇక స్క్రీన్ మీద తన పేరుని చూసుకొని సంతోషిస్తున్నట్టు ఓ వీడియోని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇనయా సుల్తానాకి ఇన్ స్టాగ్రామ్ లో 332K ఫాలోవర్స్ ఉన్నారు.
![]() |
![]() |